: వైఫై కాదు.. 'వావ్ ఫై' అంటున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్

దుబాయ్ ఎయిర్ పోర్టు మరో ఘనతను సాధించింది. లక్షలాది మంది ప్రయాణికులకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఉచిత వైఫై సేవలను అందించనుంది. 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఈ సౌకర్యం ఉంటుంది. ఈ వైఫైని 'వావ్ ఫై'గా ఎయిర్ పోర్టు సిబ్బంది పేర్కొంటున్నారు.

తమ ఎయిర్ పోర్ట్ నుంచి లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారని... వారందరికీ కుటుంబసభ్యులు, స్నేహితులతో చాటింగ్ చేయడానికి, ఈమెయిల్స్ చెక్ చేసుకోవడానికి, సోషల్ మీడియా అప్ డేట్ చూసుకోవడానికి, వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ వావ్ ఫై సేవలు ఉపయోగపడతాయని దుబాయ్ ఎయిర్ పోర్ట్ టెక్నాలజీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అధికారి బిచెల్ ఇబ్బిట్ సన్ తెలిపారు. ఏడాదికి దాదాపు 9 కోట్ల మంది ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారని చెప్పారు. 

More Telugu News