: కేంద్రం నిధులు వస్తే బడ్జెట్ లో చెప్పిన దాని కంటే ఎక్కువ ఖర్చు పెడతాం : సీఎం చంద్రబాబు

కేంద్రం నుంచి నిధులు వస్తే ఏపీ బడ్జెట్ లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశముందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. అనంతరం, చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ ను సమతూకంగా రూపొందించామన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను సమతూకంగా రూపొందించామని చెప్పారు. బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని, యువతకు నిరుద్యోగ భృతి కోసం రూ.500 కోట్లు కేటాయించామని, బీసీల సంక్షేమానికి ఏకంగా రూ.10 వేల కోట్లు కేటాయించామని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నిధులు పెంచామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చామని, అమరావతిలో స్మృతి వనానికి రూ.97 కోట్లు కేటాయించామని చంద్రబాబు పేర్కొన్నారు. 

More Telugu News