: ఏపీ వ్యవసాయ బడ్జెట్.. పూర్తి వివరాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఆర్థిక‌మంత్రి య‌న‌మల రామ‌కృష్ణుడు 2017-18 వార్షిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం రాష్ట్ర‌ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్య‌వ‌సాయ‌ బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. దేశంలోనే తొలిసారిగా బయోమెట్రిక్ ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 50 నుంచి 75 శాతం రాయితీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఇస్తున్నామ‌ని అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 9,091 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. సమగ్ర సాగునీటి, వ్యవసాయ రూపాంతీకరణకు రూ. 1600 కోట్లు కేటాయించారు. బొప్పాయి ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఏపీ ఉంద‌ని, మామిడి, టమాటా ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంద‌ని ప్ర‌త్తిపాటి చెప్పారు. మాంసం ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంద‌ని అన్నారు. పాల ఉత్పత్తిలో దేశంలో ఐదో స్థానంలో ఉన్నామ‌ని అన్నారు. ఉద్యాన పంటల నాణ్యత పెంచేందుకు కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా పది లక్షల ఎకరాలకు నీరు అందిస్తామ‌ని అన్నారు.

వ్య‌వ‌సాయ బ‌డ్జెట్‌లో కేటాయించిన నిధుల వివ‌రాలు:
* పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ. 17 కోట్లు
* రైతులకు విద్యుత్ సబ్సిడీ రూ. 3300 కోట్లు
* వడ్డీలేని రుణాలకు రూ. 172 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 147
* రైతుబంధు పథకానికి రూ. 18 కోట్లు
* పండ్ల తోటల పెంపకానికి రూ. 1015 కోట్లు
* ఆయిల్ ఫామ్ విస్తరణకు రూ. 55 కోట్లు
* సూక్ష్మ సేద్యానికి రూ. 200 కోట్లు

More Telugu News