: నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్.. రేపు చలో అసెంబ్లీ

ప్రైవేటు క్యాబ్‌ల వైఖరికి నిరసనగా నేటి అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ వెల్లడించింది. అలాగే 16న చలో అసెంబ్లీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడారు. కిలోమీటరుకు ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.11ను  ప్రైవేటు క్యాబ్‌లు రూ.7.25, రూ. 6గా తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసు సంస్థలు మోటారు వాహన చట్టం సెక్షన్ 67ను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. క్యాబ్, ఆటో రేట్లను నిర్ణయిస్తూ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ ఫీజులను ప్రభుత్వం తగ్గించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్‌కు 8వ తరగతి విద్యార్హత నిబంధన ఎత్తివేయాలని అమానుల్లాఖాన్ డిమాండ్ చేశారు.

More Telugu News