: కోహ్లీ దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు: కెప్టెన్ కు కుంబ్లే బాసట

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే బాసటగా నిలిచాడు. కోహ్లీ దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని కుంబ్లే చెప్పాడు. రాంచీలో కుంబ్లే మాట్లాడుతూ, నియంత్రణలో ఉన్నంత వరకు ఆటగాళ్ల సహజ లక్షణాలను అడ్డుకోవాలని భావించడం లేదని అన్నాడు. ప్రతి ఆటగాడికి సొంత వ్యక్తిత్వం ఉంటుందని, దానితో పాటే అతని ఆటతీరు కూడా అనుసంధానమై ఉంటుందని చెప్పాడు.

ఆటకు ఇబ్బంది కలగనంతవరకు ఎవరి లక్షణాలనూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అత్యుత్తమ ఆటకు సంరక్షకులుగా క్రికెట్‌ ను కాపాడుకోవడం ముఖ్యమని తాము నమ్ముతామని చెప్పిన కుంబ్లే, ఆటలో ముఖ్య భాగస్వాములైన ఆటగాళ్లకు కచ్చితంగా వారి బాధ్యతలు తెలుసని అన్నాడు. ఇక రెండో టెస్టులో రేగిన వివాదం గురించి మాట్లాడుతూ, ఆసీస్ బోర్డుతో మాట్లాడి బీసీసీఐ రాజీకి రావడం సముచితమని తాము భావిస్తున్నామని కుంబ్లే తెలిపాడు. వివాదం వదిలి ఆటమీద మనసు లగ్నం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కుంబ్లే పేర్కొన్నాడు. 

More Telugu News