: డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ‘దివాకర్’ బస్సు ప్రమాదం .. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ నివేదిక!

కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమేనని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే అంచనాకు వచ్చామని, ప్రమాదం సంభవించిన సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో బస్సు వెళ్తున్నట్లు గుర్తించామని ఆ నివేదికలో పేర్కొన్నారు. బస్సుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేకపోయామని తెలిపారు.

 బస్సు ప్రమాదాల నివారణకు ప్రభుత్వానికి తగిన సూచనలు చేయడంతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ముగ్గురు డ్రైవర్లు ఉండాల్సిన అవసరం ఉందని ఆ నివేదికలో సూచించారు. కాగా, రెండు వారాల క్రితం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో పదకొండు మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

More Telugu News