: డబ్బులిచ్చి అవార్డులు తెచ్చుకున్నంత మాత్రాన కేటీఆర్ చెప్పే అబద్ధాలు నిజాలు కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర‌ బడ్జెట్లో పేర్కొన్న వివరాలన్నీ తప్పుడు లెక్కలని అన్నారు. వ‌చ్చే ఏడాదిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనీ, తాము ఆ ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమేన‌ని చెప్పారు. కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చాక వ్యవసాయ ఉత్పత్తులు పడిపోయాయ‌ని, సోషల్ ఎకనామిక్ సర్వే లెక్కలు చెబుతున్నది తప్పా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై కూడా కేసీఆర్ ప్ర‌భుత్వం అవాస్త‌వాలు ప్ర‌చారం చేసుకుంటోందని, దేశంలో తెలంగాణ పెట్టుబడుల్లో ఆరో స్థానంలో ఉంద‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓ వైపు ప‌రిస్థితి ఇలా ఉంటే ప్ర‌భుత్వం మాత్రం గొప్ప‌లు చెప్పుకుంటోందని ఆయ‌న అన్నారు. డబ్బులిచ్చి తెలంగాణ‌కు అవార్డులు తెచ్చుకున్నంత మాత్రాన మంత్రి కేటిఆర్ చెప్పే అవాస్త‌వాలు నిజం కావని అన్నారు. తెలంగాణ‌ను లిక్కర్ లో, పార్టీ పిరాయింపుల్లో నెంబర్ వన్ చేయడంలో మాత్ర‌మే కేసీఆర్ విజయం సాధించారని ఆయ‌న ఎద్దేవా చేశారు.

More Telugu News