: దేశంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం: సీఎం కేసీఆర్

దేశంలో ఆదాయం పెరుగుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గొల్ల, కుర్మ, మత్స్యకారులు, జీహెచ్ఎంసీ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ బడ్జెట్ లో కుల వృత్తులకు భారీగా నిధులు కేటాయించినందుకు ఆయా వృత్తిదారులు, గ్రేటర్ హైదరాబాద్ కు రూ.వెయ్యి కోట్లు కేటాయించినందుకు కార్పొరేటర్లు సీఎంకు తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో అభివృద్ధి రేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల కంటే 21 శాతం ఆదాయం పెరుగుదల మన రాష్ట్రంలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రస్తావనను కేసీఆర్ తీసుకువచ్చారు. 23 జిల్లాల ఏపీ కంటే తెలంగాణ బడ్జెట్ ఎక్కవ అని, సమాజ పురోభివృద్ధిలో కొన్ని వృత్తులు అంతరించి పోయే పరిస్థితి ఉందని, కాలం, పరిణామాన్ని అనుసరించి ఏ వృత్తి అయినా మారుతుంటుందని, ఆయా వృత్తిదారులను ఆదుకోవాల్సిన అవసరముందని అన్నారు.

More Telugu News