: యువకులకు ఇదే మంచి అవకాశం...సమస్యలపై పోరాడాలని ప్రజల నుంచి బలమైన డిమాండ్ వచ్చింది!: పవన్ కల్యాణ్

జనసేన ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో పోటీ చేస్తామని అన్నారు. 32 సమస్యలపై పోరాడాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చిందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలన్న డిమాండ్ బలంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో పార్టీ బలోపేతానికి ప్రణాళిక రచించుకున్నామని ఆయన అన్నారు. దీంతో జూన్ నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. యూత్ లీడర్ షిప్ ను ప్రోత్సహించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు.

యూత్ లీడర్ షిప్ కోసం తాము ఒక ప్రణాళిక చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఇంతవరకు తమ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు. సరైన యువ నాయకత్వం పార్టీకి కావాల్సి ఉందని ఆయన చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికలనాటికి పూర్తి స్థాయిలో పార్టీ నిలదొక్కుకోవాలంటే, సమర్థవంతమైన నాయకత్వం కావాలని, ఆ నాయకత్వం కోసం తాము అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు. 2019 ఎన్నికల్లో పొత్తుల కోసం ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ గల వామపక్ష పార్టీల వంటివాటితో పొత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. పార్టీ నిర్మాణం తరువాతే పొత్తుల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. అధికారం చేపట్టడమే రాజకీయాల అంతిమ లక్ష్యం కాకూడదని ఆయన తెలిపారు. 60 శాతం సీట్లు యువకులకే ఇస్తామని ఆయన అన్నారు. 

More Telugu News