: డబ్బు రాలేదన్న కోపంతో ఏటీఎంను ధ్వంసం చేసిన ఖాతాదారుడు

దేశ ప్రజల నగదు కష్టాలు ఇంకా తీరలేదు. 2016 నవంబర్ 8 నుంచి ఏర్పడ్డ నగదు కష్టాలు వివిధ మలుపులు తిరుగుతూ వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాదులోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో నేడైనా ఏటీఎంల నుంచి డబ్బులు వస్తాయన్న ఆశతో పలువురు ఏటీఎంలకు క్యూ కట్టారు. హైదరాబాదు, కోఠిలోని ఉమెన్స్ కాలేజీ పక్కనే ఉన్న ఫెడరల్ బ్యాంకు ఏటీఎంకు ఓ వినియోగదారుడు వెళ్లాడు. విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా, నగదు లేదన్న సమధానం రిసీట్ రూపంలో వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు వినియోగదారుడు ఆ ఏటీఎంను ధ్వంసం చేశాడు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News