: ఏ స్థాయి క్రికెట్‌లోనూ పాల్గొన‌కుండా పాకిస్థాన్ క్రికెట‌ర్‌పై నిషేధం

అవినీతి వ్య‌తిరేక కోడ్‌ను ఉల్లంఘించాడ‌న్న కార‌ణంగా పాకిస్థాన్ పేస్‌బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ఇర్ఫాన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ జ‌రుగుతున్న సంద‌ర్భంగా మ‌హ్మ‌ద్ ఇర్ఫాన్‌ను ఓ బుకీ క‌లిసినా ఆ విష‌యాన్ని ఆయ‌న‌ పీసీబీకి చెప్ప‌లేదు. దీంతో ఇర్ఫాన్ త‌మ కోడ్‌లోని ఆర్టిక‌ల్ 2.4.4ను ఉల్లంఘించార‌ని పీసీబీ తెలిపింది. ఈ విష‌యంపై ఆ క్రికెట‌ర్‌కు నోటీస్ ఆఫ్ చార్జ్ పంపించామ‌ని పేర్కొంది. ఇక‌పై అత‌ను ఏ స్థాయి క్రికెట్‌లోనూ పాల్గొన‌కుండా నిషేధం విధించిన‌ట్లు పేర్కొంది.

ఈ చ‌ర్య‌పై ఇర్ఫాన్‌ 14 రోజుల్లోగా స్పందించాల్సి ఉంటుంది. కాగా, ఈ విష‌యంపై మాట్లాడిన ఇర్ఫాన్‌ ఈ మ‌ధ్యే త‌న త‌ల్లిదండ్రులు చనిపోయార‌ని, తాను ఆ బాధ‌లో ఉండ‌డంతోనే ఆ విష‌యాన్ని చెప్ప‌లేక‌పోయాన‌ని అంటున్నాడు. ఇటీవ‌లే ఇర్ఫాన్‌ యాంటీ క‌రప్ష‌న్ టీమ్ ముందు హాజ‌రై త‌న‌ను బుకీలు క‌లిశార‌ని ఒప్పుకున్నాడు. ఈ విష‌యంలో విచార‌ణ కొన‌సాగుతోంది.

More Telugu News