: డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలో ఇండో అమెరికన్‌కు ఉన్నత పదవి

అమెరికా మాజీ అధ్యక్షుడు బ‌రాక్‌ ఒబామా హయాంలో ఉన్న ఒబామాకేర్‌ పథకాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం తొలగించి ఆ స్థానంలో కొత్త పథకం తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కం తీసుకురావ‌డంలో కీలక పాత్ర పోషించిన ఇండో అమెరికన్‌ సీమా వర్మకు ట్రంప్‌ యంత్రాంగంలో కీల‌క ప‌ద‌వి ల‌భించింది. త‌మ దేశ‌ ఆరోగ్య శాఖలో ఆమె కీలకంగా వ్యవహరించనున్నారని శ్వేత‌సౌధం పేర్కొంది. సీమా వర్మకు ఆ పోస్ట్‌ ఇవ్వడాన్ని సెనేట్‌ 55-43 ఓట్లతో ఆమోదించిందని తెలిపింది. అమెరికా కొత్త ప్ర‌భుత్వంలో ఉన్నత స్థానాలకు సెనేట్‌ ఆమోదించిన రెండో ఇండో అమెరికన్‌గా సీమా వర్మ నిలిచారు. ఆమె అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో ఆరోగ్య విభాగంలో విశేష‌మైన సేవ‌లు అందించారు.

More Telugu News