: నా వేతనం చారిటీకే!: స‌హృద‌యాన్ని చాటుకున్న డొనాల్డ్ ట్రంప్!

విదేశీయులు తమ దేశంలోకి చొరబడకుండా ఆంక్ష‌లు, మెక్సికో స‌రిహ‌ద్దుల్లో భారీ గోడ, వీసాల‌పై కొత్త నిబంధ‌న‌లు వంటి సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో ముందుకు వెళుతోన్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరుకి విభిన్నంగా త‌న స‌హృద‌యాన్ని చాటారు. తన వార్షిక వేతనాన్నంతటినీ చారిటీకి విరాళంగా ఇస్తాన‌ని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి వార్షిక వేత‌నం 400,000 డాలర్లు(రూ.2,64,82,000) కాగా ఈ మొత్తాన్ని ఈ ఏడాది చివర్లో ఆయన చారిటీకి ఇవ్వ‌నున్నారు. ఇప్పటివరకు వైట్ హౌస్ నుంచి వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌ల‌న్నింటిలో ఇదో అనూహ్య ప్రకటన అని విశ్లేష‌కులు అంటున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్.. తాను అధ్య‌క్షుడినైతే వేతనం తీసుకోబోనని, కేవలం ఒక్క డాలర్ ను మాత్రమే వేతనంగా తీసుకుంటాన‌ని అన్నారు.

More Telugu News