: రోజూ తలస్నానం వద్దు.. వారానికి మూడు రోజులే బెస్ట్!

కొంతమందిలో చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంది. వాతావరణ కాలుష్యంతోపాటు తీసుకునే ఆహారం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుందని చాలా మంది నమ్మకం. ఇక జుట్టు రాలిపోతుందన్న విషయం తెలిస్తే మహిళలు తెగ బాధపడిపోతారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొందరు ప్రతిరోజు తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయని వారి నమ్మకం. అంతేకాదు, చిరాకు తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుందని కూడా నమ్ముతారు.

అయితే నిద్ర, ఇరిటేషన్ గురించి పక్కన పెడితే రోజూ తలస్నానం చేయడం అంతమంచిది కాదంటున్నారు నిపుణులు. క్రమం తప్పకుండా తలస్నానం చేసే వారిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రకరకాల షాంపూలు ఉపయోగించడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతుందని అంటున్నారు కాస్మాలజిస్టులు. షాంపూల్లోని గాఢ రసాయనాలు కురులకు చేటు చేస్తాయని, కాబట్టి వారానికి మూడుసార్లకు మించి హెయిర్ వాష్ మంచిదని కాదని సలహా ఇస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కుంకుడుకాయలతో ట్రై చేయవచ్చని సూచిస్తున్నారు.

More Telugu News