: భూమా సీటును ఎవరికి కేటాయించాలి?: కర్నూలు నేతలతో లోకేష్ చర్చలు

భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో నంద్యాల ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో, అక్కడ ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో, ఈ ఉదయం నంద్యాలలోని ఓ హోటల్ లో కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయినట్టు తెలుస్తోంది. భూమా స్థానంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంపై వీరు చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

మరోవైపు నంద్యాల స్థానాన్ని భూమా మరో కుమార్తె నాగమౌనికకు కానీ, భూమా అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డికి కానీ కేటాయించాలని కొందరు టీడీపీ నేతలు కోరుతున్నారు. నంద్యాల ఎమ్మెల్యే స్థానాన్ని మాజీ మంత్రి శిల్పా మోహన రెడ్డికి కేటాయించి, భూమా కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని మరికొందరు కోరుతున్నారు. 

More Telugu News