: వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయ్.. ఇలా ఉపశమనం పొందండి!

సాధార‌ణంగా మే నెల‌లో అధికంగా విరుచుకుప‌డే భానుడు ఈ సారి అంత‌కంటే ముందుగానే త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెల‌లోనే ఎండలు మండుతున్నాయి. దీంతో ఈ సమయంలో బయటకు వెళ్లేవారు శీతల పానీయాలను తీసుకుంటూ వుంటారు. అయితే, ఇలా శీత‌ల పానీయాలను తీసుకునే వారికి వైద్యులు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.

ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌ండి:

1. కూల్‌డ్రింక్స్ జోలికిపోకూడ‌దు: వాటిలో కలిపే వివిధ రకాల రసాయనాలతో భవిష్యత్‌లో మధుమేహం రావ‌చ్చు

2. తెల్లటి కాటన్ దుస్తులు ధరిస్తే ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు

3. చలువ కళ్లద్దాలు వాడితే సూర్య రశ్మి నుంచి కళ్లను కాపాడుకోవచ్చు

4. తగిన మోతాదులో నీరు తీసుకోవాలి. ఈ కాలంలో రోజుకు కనీసం సగటున 2 లీటర్ల నీరు తాగడం మంచిది

5. నిమ్మ, బత్తాయి జ్యూస్‌లు చర్మ సౌందర్యానికి, ఆర్యోగానికి ఎంతో మేలు

6. కీర దోస‌ తీసుకుంటే విటమిన్ ఏ, బీ, సీలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్ ఇంకా అనేక పోషకపదార్ధాలు అందుతాయి

7. పుచ్చకాయ, కర్బూజా తీసుకుంటే శ‌రీరానికి నీటి శాతం అధికంగా అంది శరీరాన్ని చల్లగా తేమగా ఉంచుతాయి. శరీరంలో వేడి తగ్గడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.

8. కొబ్బరి నీరు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ కాలంలో వేడిని తగ్గించడానికి కొబ్బరి నీరు దివ్యౌషధంలా ప‌నిచేస్తుంది

9. రోజుకి రెండు, మూడుసార్లు బ‌ట‌ర్ మిల్క్ తీసుకుంటే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు

10. వేస‌వి కాలంలో టీ, కాఫీల‌కి దూరంగా ఉండ‌డం మంచిది. ఇవి అధికంగా తీసుకుంటే కడుపులో మంట, పుల్లటి త్రేనుపులు, ఎసిడిటీ స‌మ‌స్య‌లు రావ‌చ్చు.

More Telugu News