: గోవా ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిగ్విజయ్ సింగ్!

గోవా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని... తమను క్షమించాలని ఓటర్లను కోరారు. అధికారం, డబ్బుతో బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల తీర్పు ఓడిపోయిందని, మనీ పవరే గెలిచిందని విమర్శించారు. మరోవైపు గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుండటంపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీని ప్రజలు రెండో స్థానానికి పరిమితం చేశారని... అలాంటి పార్టీకి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం లేదని విమర్శించారు.
వాస్తవానికి గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యా బలం బీజేపీకి లేకపోయినప్పటికీ... అక్కడున్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. 

More Telugu News