: మనోహర్ పారికరే సీఎం కావాలంటున్న గోవా ఎమ్మెల్యేలు

గోవా ప్రజలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. 40 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి వచ్చింది 13 సీట్లు మాత్రమే. అయినా బీజేపీ మాత్రం అధికార పీఠాన్ని మరోసారి సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు 17 స్థానాలు రాగా, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, స్వతంత్రులు మూడు సీట్ల చొప్పున మొత్తం 9 స్థానాల్లోను, ఎన్సీపీ ఒక చోట విజయం సాధించాయి. ఈ క్రమంలో బీజేపీ మరో 8 మంది మద్దతు సంపాదిస్తే అధికారం సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యులు మాజీ సీఎం, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను సీఎం అభ్యర్థిగా తీసుకురావాలని కోరుతున్నారు. పారికర్ కు మంచి వ్యూహకర్తగా పేరుంది. ఆయన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఓ లేఖ కూడా రాశారు. సీఎం అభ్యర్థిగా తమ ఓటు ఆయనకేనని స్పష్టం చేశారు. 

More Telugu News