: ఇప్పుడేమంటారు?.. సెక్యులర్ పార్టీలను నిలదీసిన ఒవైసీ

ముస్లింల ఓటు బ్యాంకుతో మజ్లిస్ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్న సెక్యులర్ పార్టీ నేతలు ఇప్పుడు ఏమంటారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. యూపీలో ముస్లింలు అక్కడి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఓటు వేశారన్న విషయం తాజా ఫలితాలతో స్పష్టమైందన్నారు. మత ప్రాతిపదికన వారు ఓట్లు వేయలేదని పేర్కొన్నారు. మజ్లిస్ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పించిన వారు ఇప్పుడు వారి ఓటు బ్యాంకు ఎటువెళ్లిందో తెలుసుకోవాలని సూచించారు. యూపీ ప్రజల తీర్పును మజ్లిస్ గౌరవిస్తుందని పేర్కొన్న అసద్ బీజేపీకి మాత్రం ముస్లింల నుంచి అత్యధిక ఓట్లు పడలేదని తెలిపారు.

More Telugu News