: హైదరాబాదు ఐటీ ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టిస్తున్న ట్రంప్ కొత్త బిల్లు!

ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ చేస్తుండటం వల్ల అమెరికన్లు భారీ ఎత్తున ఉపాధిని కోల్పోతున్నారని భావిస్తున్న ట్రంప్ సర్కారు... ఔట్ సోర్సింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు హైదరాబాదులో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ బిల్లు పాసైతే హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోనుంది. మన ఐటీ పరిశ్రమ మొత్తం ఎక్కువగా అమెరికా మీద ఆధారపడి ఉండటమే దీనికి కారణం. మన ఎగుమతుల్లో 60 శాతం అమెరికాకే. ఔట్ సోర్సింగ్ పరంగా అంతర్జాతీయంగా భారత్ వాటా 55 శాతంగా ఉందని నాస్కామ్ కూడా చెబుతోంది.

ఈ నేపథ్యంలో, ట్రంప్ సర్కారు ప్రవేశ పెట్టిన బిల్లు పాస్ అయితే... హైదరాబాద్ కు జరిగే ఆర్థిక నష్టం అంతా ఇంతా కాదు. అంతేకాదు, ఇక్కడ పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులపై కూడా దాని ప్రభావం ఉంటుంది. బిల్లు పాస్ అయితే హైదరాబాదులోని ఐటీ పరిశ్రమ 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. దాదాపు 5వేలకు పైగా ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు హైదరాబాదులో ఉన్నాయని ఒక అంచనా. వీటిలో అత్యధిక కంపెనీలు ఔట్ సోర్సింగ్ ఆధారంగానే పని చేస్తున్నాయి. హైదరాబాదు నుంచి ఏటా రూ. 87 వేల కోట్ల ఎగుమతులు నమోదవుతున్నాయి.

More Telugu News