: మొదలైన కౌంటింగ్... తెరచుకున్న పోస్టల్ ఓట్లు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ రాష్ట్రాల్లో ప్రత్యేక పారామిలిటరీ బలగాల భద్రత మధ్య ఈవీఎంలను తెరుస్తున్న అధికారులు, అంతకుముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తరువాత, పర్యవేక్షణ అధికారి సమక్షంలో ఈవీఎం సీల్ ను తీసే అధికారులు, తిరిగి దానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్నది వెల్లడిస్తారు. కాగా, చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్ లో పూర్తి ఫలితాలు మధ్యాహ్నం 12 లోగా వెల్లడి కావచ్చని తెలుస్తోంది. ఆపై ఉత్తరాఖండ్ ఫలితాలు ఒంటి గంటకూ, పంజాబ్ ఫలితాలు 3 గంటలకు, ఉత్తరప్రదేశ్ ఫలితాలు సాయంత్రం 5 గంటల్లోపు వెలువడవచ్చని భావిస్తున్నారు.

More Telugu News