: యూఎస్ స్కామ్ లో 30 మంది ఎన్నారైలు... కేసులు నమోదు

యూఎస్ లో ఇతరుల క్రెడిట్ కార్డులను దొంగిలించి సుమారు రూ. 23.8 కోట్ల మేర మోసగించిన ఆరోపణలపై 30 మంది భారతీయ అమెరికన్లపై అక్కడి అధికారులు కేసులను నమోదు చేయడం కలకలం రేపింది. న్యూయార్క్ పరిధిలోని ఎన్నారై మహమ్మద్ రానా ఈ స్కామ్ కు ప్రధాన సూత్రధారని, అతని సహచరుడు ఇంద్రజిత్ సింగ్ ది కీలక పాత్రని ఫెడరల్ పోలీసులు తేల్చారు. వీరంతా ఓ గ్రూప్ గా ఏర్పడి పలువురి వ్యక్తిగత క్రెడిట్ కార్డుల వివరాలు దొంగిలించారని, ఆపై పలు ఆర్థిక సంస్థలు, వ్యాపారులు, వ్యక్తులకు నష్టం కలిగించారని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ వెల్లడించారు. కార్డుల అసలు యజమానులం తామేనంటూ, కొత్త కార్డులు కావాలని బ్యాంకులను ఆశ్రయించే వీరు, అవి కార్డుదారుల చిరునామాకు చేరిన తరువాత, వాటిని పోస్టు బాక్సుల నుంచి దొంగిలించి మోసాలకు పాల్పడేవారని, వీటితో పెద్దఎత్తున డబ్బు విత్ డ్రా, షాపింగ్ చేస్తుంటారని ఆయన తెలిపారు. ఈ కేసులో విచారణ జరుగుతోందని వెల్లడించారు.

More Telugu News