: అప్పట్లో చిల్డ్రన్స్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు మనోరంజన్ బ్యాంక్.. నకిలీనోట్ల కలకలం

కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఏటీఎం నుంచి న‌కిలీ నోట్లు వ‌చ్చిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. క‌రెన్సీ నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట చిల్డ్రన్స్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా అని ఆ నోట్ల‌పై క‌నిపించింది. తాజాగా ఢిల్లీలోని ఓ ఐసీఐసీఐ ఏటీఎం నుంచి భారతీయ మనోరంజన్ బ్యాంకు అని ముద్రించి ఉన్న నోట్లు వ‌చ్చాయి. అంతేకాదు రిజర్వ్ బ్యాంకు నోట్లలో ఉండని పది ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ బ్యాంకు అధికారులు ఆ నోట్ల‌ను ఏటీఎంలో పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ నోట్ల‌పై సీరియల్ నంబర్లు అన్నీ సున్నాలే ఉన్నాయి. రూబీ సైన్ లేదు, ఆర్బీఐ ముద్రకు బదులు 'పీకే' సినిమా లోగో ఉంది. ఆర్‌బీఐ గవర్నర్ సంతకం కూడా లేదు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు కొందరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు.

More Telugu News