: రాంచీలో కోహ్లీ పరుగుల దాహం తీర్చుకుంటాడు: ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడని... రాంచీలో జరిగే మూడో టెస్టులో తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన గత రెండు టెస్టుల్లో కోహ్లి బ్యాటింగ్ లో విఫలమైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భారత్, ఆసీస్ టెస్ట్ సిరీస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను క్లార్క్ వెల్లడించాడు.

ఈ సీరిస్ ను తామే గెలుస్తామన్న క్లార్క్... సిరీస్ చివరి వరకూ హోరాహోరీ పోరు ఖాయమన్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదం సద్దుమణగడంతో ఇరు జట్లు ఇప్పుడు మూడో టెస్టుపై దృష్టి సారిస్తాయన్నాడు. వచ్చే టెస్టులో గెలుపు ఇరు జట్లకు కీలకమన్న క్లార్క్ తన మద్దతు ఎప్పూడు ఆసీస్ కే ఉంటుందన్నాడు. ఈ సిరీస్ ను ఆసీస్ 2-1తో గెలుచుకుంటుందని జోస్యం చెప్పాడు. ఇదిలా వుంటే విరాట్ కోహ్లీపైనే ఆసీస్ జట్టు ఎక్కువగా దృష్టి సారించిందా? అనే ప్రశ్నకు క్లార్క్ బదులిస్తూ... అది కేవలం విరాట్ పట్ల అప్రమత్తంగా ఉండటం తప్పితే, అతనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఎంతమాత్రం కాదన్నాడు.

More Telugu News