: జియోకు షాక్... ఉచిత డేటా ఇస్తామంటూ ఇండియాకు వచ్చిన అమెరికన్ సంస్థ 'జన'

ఉచిత డేటా, ఆఫర్లతో దూసుకొచ్చి టెలికం సంస్థలకు నిద్రలేకుండా చేసిన రిలయన్స్ జియోకు షాక్ ఇచ్చేందుకు ఓ అమెరికన్ సంస్థ ఇండియాకు వస్తోంది. బోస్టన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 'జన' ఇండియాలో ఉచితంగా డేటాను అందిస్తామని ప్రకటించింది. ప్రారంభదశలో రోజుకు 10 మెగాబైట్ల డేటాను ఫ్రీగా ఇస్తామని, తమకు ఆదాయం పెరిగే కొద్దీ డేటా ఆఫర్ ను సవరించుకుంటూ వెళతామని సంస్థ ప్రకటించింది.

 ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో సరికొత్త బ్రౌజర్ 'జన'ను నేడు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్న సంస్థ ఇప్పటికే జియో సహా భారతీ ఎయిర్ టెల్ వంటి ఇండియన్ టెల్కోలతో డీల్స్ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సంస్థ కో-ఫౌండర్ నాథన్ ఈగిల్ మాట్లాడుతూ, 100 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఎంసెంట్ యాప్ స్టోర్ నుంచి తమ 'జన' బ్రౌజర్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఆపై రోజుకు 10 మెగాబైట్ల డేటాను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన వెల్లడించారు. ప్రకటనకర్తలకు కూడా అవకాశాలను అందిస్తున్నామని తెలిపారు.

More Telugu News