: తెలంగాణ అధికారుల చిన్న నిర్లక్ష్యం ఖరీదు కోటిన్నర రూపాయలు!

నిన్న రద్దయిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం దాదాపు రూ. 1.5 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసింది. తిరిగి ఎన్నికలు జరిపించడానికి, ముందు చూపు లేకుండా, శాఖల మధ్య సమన్వయం కొరవడి వాయిదా పడ్డ ఇంటర్ పరీక్షలకు తిరిగి ఏర్పాట్లు చేసేందుకు ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఓట్లేసిన ఉపాధ్యాయుల నుంచి అధికారులు, ఎన్నికల యంత్రాంగం మరో సారి శ్రమించాల్సి వుండగా, విద్యార్థులు సైతం ఒత్తిడిలో పడిపోయారు.

 వాస్తవానికి తొలి ప్రూఫ్ లో బ్యాలెట్ సక్రమంగానే ఉందని, చివరికి వచ్చే సరికి ఫోటోలు మారిపోయాయని, దీనిపై విచారణ జరుగుతుందని ఈసీ భన్వర్ లాల్ ఇప్పటికే ప్రకటించారు. ప్రింట్ అయిన బ్యాలెట్ ను నోడల్ అధికారిగా ఉన్న రమేష్ పరిశీలించనందునే ఈ తప్పు జరిగినట్టు ఈసీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇక ఈ ఎన్నికల కోసం నిన్న మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 126 పోలింగ్ కేంద్రాల్లో పనిచేసిన 50 వేల మందికీ అదనపు వేతనాలు, మరోసారి ఎన్నిక జరిపే వేళ కూడా అదనపు ఇన్సెంటివ్ లు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కాగా, ఫోటోల మార్పు వెనుక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలూ వస్తున్నాయి.

More Telugu News