: మురళీ విజయ్ ను తప్పించి మ్యాక్స్ వెల్ కు పగ్గాలిచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్

వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదవ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తమ కెప్టెన్ ను మార్చింది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న మురళీ విజయ్ ను తప్పించి, ఆ స్థానంలో మ్యాక్స్ వెల్ ను కెప్టెన్ గా నియమించామని, ఈ సీజన్ లో మురళీ విజయ్ ఆటగాడిగా కొనసాగుతాడని వెల్లడించింది. మ్యాక్స్ వెల్ కెప్టెన్ గా ఉంటే, మరిన్ని విజయాలు సాధించగలమన్న నమ్మకంతోనే ఈ పని చేసినట్టు ప్రకటించింది.

కాగా, ప్రస్తుతం పంజాబ్ జట్టులో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వెస్టిండీస్ ట్వంటీ 20 మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ, దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా తదితర దిగ్గజాలు ఉన్నప్పటికీ, వారందరినీ కాదని మ్యాక్స్ వెల్ ను కెప్టెన్ గా చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, తాజా పంజాబ్ నిర్ణయంతో, ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో కెప్టెన్లగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇప్పటికే పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో స్టీవ్ స్మిత్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా డేవిడ్ వార్నర్ నియమితులైన సంగతి తెలిసిందే.

More Telugu News