: ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పెద్దపీట వేసినా... పెద్దగా స్పందించని మార్కెట్లు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మినీ సంగ్రామంలో నాలుగు రాష్ట్రాలు బీజేపీ పరమవుతాయని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ, మార్కెట్ వర్గాలు మాత్రం దాన్ని పెద్దగా నమ్మినట్టు కనిపించలేదు. గతంలో బీహార్ విషయంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వాస్తవ ఫలితాలు తప్పని నిరూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మార్కెట్ ను లాభాల్లోకి పంపలేకపోయింది. ఈ ఉదయం సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే, 120 పాయింట్ల వరకూ లాభపడ్డ సెన్సెక్స్, ఆపై కిందకు దిగివచ్చింది. నూతన కొనుగోళ్లతో పోలిస్తే, అమ్మకాలు అధికంగా ఉండటంతో సెన్సెక్స్ అత్యంత కీలకమైన 29 వేల స్థాయి కన్నా కిందకు దిగివచ్చింది. ఈ ఉదయం 11:50 గంటల ప్రాంతంలో బీఎస్ఈ సూచిక 40 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. మిడ్ క్యాప్ స్వల్ప నష్టంలో, స్మాల్ క్యాప్ నామమాత్రపు లాభంలో కొనసాగుతోంది.

More Telugu News