: శాంసంగ్ తో కలిసి అవినీతి... పదవి నుంచి తప్పుకున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు

ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తో కలసి అవినీతి బాగోతాన్ని నడిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హేకు ఆ దేశ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బతగలడంతో, తన పదవికి రాజీనామా చేశారు. ఆమెపై పార్లమెంట్ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించగా, సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. దీంతో ఆమె దేశాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు.

ప్రెసిడెంట్ ను అభిశంసన ద్వారా తొలగించడం దక్షిణ కొరియాలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. తన స్నేహితురాలు చోయ్ సూన్ తో కలసి, శాంసంగ్ కు అనుకూల నిర్ణయాలను ఆమె తీసుకున్నారన్నది పార్క్ పై వచ్చిన ప్రధాన అభియోగం. ఈ కేసు కోర్టుకు ఎక్కగా, ఎనిమిది మంది న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత న్యాయస్థానం విచారించి, ఆమె అవినీతికి పాల్పడ్డారని తేల్చింది. ఇక మరో 60 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని దక్షిణ కొరియా ఎన్నుకోవాల్సి వుంది.

More Telugu News