: విమానాలు హైజాక్ కాకుండా ఉండాలంటే ఇలా చేయాలి.. చురకలంటించిన అశోక్ గజపతి

హైజాక్ భయం నుంచి బయటపడాలంటే విమానాశ్రయాల్లోకి ఎవరినీ అనుమతించకపోవడమే మంచిదంటూ పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు సీఐఎస్ఎఫ్‌కు చురకలంటించారు. ఎయిర్‌పోర్టుల్లో హ్యాండ్ బ్యాగులను తనిఖీ చేసి సెక్యూరిటీ స్టాంప్ వేయాలని పట్టుబడుతున్న సీఐఎస్‌ఎఫ్‌ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అసలు విమానాశ్రయాల్లోకి ఎవరినీ పంపకుండా ఉంటే హైజాక్‌కు అవకాశమే ఉండదని అన్నారు. భద్రతా చర్యలు ఆటంకాలు లేకుండా, అర్థవంతంగా ఉండాలని పేర్కొన్న మంత్రి ‘‘విమానాశ్రయాల్లోకి ఎవరినీ అనుమతించకపోతే హైజాక్ భయమూ ఉండదు, విమానాలకు పనీ ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. అమలుకు వీలుకాని రక్షణ చర్యల వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు.  పౌరవిమానయాన రక్షణ విభాగం నిర్దేశించిన ప్రమాణాలను సీఐఎస్ఎఫ్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

More Telugu News