: వివాదాస్పద వ్యాఖ్యలపై.. క్షమాపణలు చెప్పిన రాంగోపాల్ వర్మ!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వెనకడుగు వేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, కేసులతో ఉక్కరిబిక్కిరి చేయడంతో వర్మ వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన వర్మ తన వ్యాఖ్యల కారణంగా బాధ పడిన వారికి ట్విటర్ ద్వారా క్షమాపణలు చెబుతున్నానన్నారు.

ఈ సందర్భంగా ఆయన చెబుతూ.... ‘నేను నా అభిప్రాయాలు వ్యక్తపరిచాను. మహిళా దినోత్సవం సందర్భంగా నేను పోస్ట్ చేసిన మొరటు ట్వీట్స్ ను తప్పుగా భావించిన వారికి క్షమాపణ చెబుతున్నాను. నా వ్యాఖ్యలు ఎవరికైతే నిజంగా కోపం తెప్పించాయో వారిని మాత్రమే క్షమాపణ అడుగుతున్నాను. ప్రచారం కోసం హడావుడి చేసిన వారికి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామని బెదిరించిన వారికి మాత్రం నా క్షమాపణలు వర్తించవు’ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. వర్మ వ్యాఖ్యలపై హక్కుల కార్యకర్తలు కేసులు నమోదు చేయగా, ఎన్సీపీ నేత చెప్పుతో కొడతామని హెచ్చరించడం విశేషం. దీంతో వర్మ వెనక్కి తగ్గాడు. 

More Telugu News