: తగ్గిన బంగారం ధరలు.. రూ.30 వేల దిగువకు పసిడి ధర!

ఈ రోజు బంగారం ధర రూ.250 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ.29,250 గా ఉంది. ఇక, వెండి ధర విషయానికొస్తే, రూ.600 తగ్గి రూ. కిలో ధర రూ. 42 వేల దిగువకు చేరింది. ఈ రోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.41.500గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్లు తగ్గిపోవడంతో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరలు తగ్గాయని బులియన్ వర్గాలు తెలిపాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధరలు తగ్గినట్టు సమాచారం.

More Telugu News