: టాటాలకు ఆర్బీఐ షాక్... డొకొమొతో సెటిల్ మెంట్ కుదరదని స్పష్టీకరణ

జపాన్ కు చెందిన టెలికం సంస్థ ఎన్టీటీ డొకొమొతో టాటా సన్స్ చేసుకున్న మధ్యవర్తిత్వ ఒప్పందానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రేకులు వేసింది. ఈ రెండు సంస్థల మధ్యా కుదిరిన సెటిల్ మెంట్ ఒప్పందంపై ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయని, దీనికి తాము వ్యతిరేకమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. డొకొమొ సంస్థ వాటాల బదిలీ అక్రమమని, ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మెయిన్ టెనెన్స్ యాక్ట్) నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆర్బీఐ తరఫు న్యాయవాది వాదించగా, ఆర్బీఐకి ఉన్న అభ్యంతరాలపై రిపోర్టును కోర్టుకు అందించాలని న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ఆదేశించారు. విచారణను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించగా, ఈలోగానే నివేదిక ఇస్తామని ఆర్బీఐ తెలిపింది.

More Telugu News