: 'యూ ఆర్ ట్రంప్డ్'... కెనడా పౌరసత్వమున్న భారత యువతిని రానివ్వని యూఎస్!

ఆమె పేరు మన్ ప్రీత్ కూనీర్. కెనడా పౌరసత్వమున్న భారత సంతతి యువతి. మాంట్రియల్ లో నివసిస్తుంటుంది. ఇటీవల, అమెరికాకు వెళ్లేందుకు క్యూబెక్ - వెర్నాంట్ సరిహద్దుల వద్దకు ఆమె వెళ్లగా, దాదాపు ఆరు గంటల పాటు నిలిపిన సరిహద్దు భద్రతాధికారులు, ఆమె యూఎస్ లోకి ప్రవేశించాలంటే, ఇమిగ్రెంట్ వీసా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తూ, రానివ్వలేదు. ఈ విషయంలో కెనడా పౌరురాలికి అన్యాయం జరిగిందంటూ, 'ది హఫింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఆరు గంటల పాటు తనను ఆపేసి, వేలి ముద్రలు, ఫోటోలు తీసుకుని, ఎన్నో ప్రశ్నలతో విసిగించి, ఆపై యూఎస్ వీసాలేని కారణంగా ప్రవేశానికి అనర్హురాలినని చెప్పారని మన్ ప్రీత్ వాపోయింది. తుది నిర్ణయాన్ని వెల్లడించే ముందు నా వద్దకు వచ్చిన ఓ అధికారి "ఇప్పుడు నువ్వేం అనుకుంటున్నావో నాకు తెలుసు. యూఆర్ బీయింగ్ ట్రంప్డ్" అని అన్నాడని, తనకు అమెరికాలోకి ఎంట్రీ లేకపోవడాన్ని నమ్మలేకపోతున్నానని ఆమె అన్నారు. గతంలో ఎన్నోమార్లు తాను ఈ సరిహద్దు గుండా ప్రయాణించానని తెలిపారు. గత సంవత్సరం డిసెంబరు నుంచి పరిస్థితి మారిపోయిందని అన్నారు.

More Telugu News