: మీలో తప్పులు పెట్టుకుని కోహ్లీని విమర్శించడమెందుకు?: కోహ్లీకి మద్దతిచ్చిన షోయబ్ అఖ్తర్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఊహించని మద్దతు లభించింది. స్మిత్ విషయంలో కోహ్లీ వ్యవహార శైలి సరికాదని హితవు పలికిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీకి పాకిస్థాన్ స్పీడ్ స్టర్ గా పేరొందిన మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ క్లాస్ తీసుకున్నాడు. తప్పు మీలో ఉంచుకుని కోహ్లీని విమర్శించడం సరికాదని సూచించాడు. మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే కోహ్లీతో పాటు జట్టు కూడా పుంజుకుని విజయం సాధించిందని అఖ్తర్ తెలిపాడు.

కోహ్లీని లక్ష్యం చేసుకుని విమర్శించడం వల్ల అతనిలో మరింత కసి రేగుతుందని, దీంతో దూకుడు పెంచుతాడని, అది ఆసీస్ కు ఏమాత్రం మంచిది కాదని షోయబ్ హితవు పలికాడు. కాగా, కోహ్లీ వ్యవహార శైలితో అతనిపై గౌరవం పోతుందని, స్మిత్ పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరు సరికాదని హీలీ హితవు పలికిన సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పు సంభవించదని అన్నాడు. 

More Telugu News