: ‘మెన్స్ డే’ కోసం గూగుల్ సెర్చ్ చేసిన పురుష పుంగవులు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన ఈ రోజున ఓ ఆశ్చర్యకరమైన విషయం చోటు చేసుకుంది. అత్యధిక శాతం మంది పురుషులు ‘గూగుల్’లో  ‘మెన్స్ డే’ కోసం సెర్చ్ చేశారట. ఈ విషయంలో హర్యానా మగాళ్లు ముందు వరుసలో ఉన్నారట. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కొసమెరుపు ఏంటంటే.. ప్రతి ఏటా నవంబర్ 19వ తేదీ ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’ లేదా పురుషుల దినోత్సవం అనే సంగతి చాలా మంది పురుష పుంగవులకు తెలియదట. 

More Telugu News