: ‘ఫేస్ బుక్’ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ గురించిన ఆసక్తికర విషయాలు!

‘ఫేస్ బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కు ఉన్న పాప్యులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది మే 25న ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్శిటీ 366వ స్నాతకోత్సవానికి గౌరవ వక్తగా హాజరు కానున్న జుకర్ బర్గ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

* జుకర్ బర్గ్ ను ఆయన స్నేహితులు ‘జుర్క్’ అని పిలిస్తే, ఆయన తల్లి మాత్రం ‘ప్రిన్స్ లే’ అని పిలుస్తారట.
* జుకర్ బర్గ్ పాఠశాల విద్య నభ్యసించే సమయంలోనే .. ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఆయనకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
* జుకర్ బర్గ్ కు కంప్యూటర్ శిక్షణ నిమిత్తం, అతని తల్లిదండ్రులు ఓ ట్యూటర్ ను ఏర్పాటు చేశారట. అయితే, అతనికి ఉన్న నాలెడ్జి చూసి ఆ ట్యూటరే ఆశ్చర్యపోయాడట.
* జుకర్ బర్గ్ కు సుమారు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి నిర్వహించే డెంటల్ క్లీనిక్ కోసం ఓ ప్రోగ్రామింగ్ సిస్టం తయారు చేశాడట. పేషెంట్ల వివరాలను రిసెప్షనిస్టు పదే పదే ఫోన్ చేసి చెప్పక్కర్లేకుండా, ఈ ప్రోగ్రామింగ్ సిస్టం ద్వారా ఆయన తండ్రి ఇట్టే తెలుసుకునేవాడట.
* హార్వర్డ్ యూనివర్శిటీలో జుకర్ బర్గ్ చదువుకునే సమయంలో ‘ఫేస్ మాస్’ అనే ఓ ప్రాజెక్టును తయారు చేశాడు. ఇద్దరు వ్యక్తుల్లో ఏ వ్యక్తి ఆకర్షణీయంగా ఉన్నాడో దీని ద్వారా తెలుసుకునే అవకాశం ఉండేది. దీంతో, ఆ ప్రాజెక్టును యూనివర్శిటీ రద్దు చేసింది. అంతేకాకుండా, వర్శిటీలో ఉండగా ఇంటర్నెట్ ను వినియోగించవద్దంటూ జుకర్ బర్గ్ పై ఆంక్షలు విధించారట.
* చైనాకు చెందిన ప్రిస్కిల్లాను ఓ పార్టీలోని రెస్ట్ రూమ్ క్యూలో చూసి ఇష్టపడి జుకర్ బర్గ్ పెళ్లి చేసుకున్నాడు.
* ప్రిస్కిల్లాకు కానుకగా ఇచ్చిన వెడ్డింగ్ రింగ్ ను జుకర్ బర్గ్ స్వయంగా తయారు చేశారట
* ప్రిస్కిల్లా తల్లిదండ్రులతో మాట్లాడేందుకని, 2010లో ఆయన చైనా భాష నేర్చుకున్నారు.
* జుకర్ కు నచ్చిన మ్యూజిక్ ఆర్టిస్టులు గ్రీన్ డే, షకీరా, జై బెడ్, టైలర్ స్విఫ్ట్.
* జుకర్ బర్గ్ కు కలర్ బ్లైండ్ నెస్ (కొన్ని రకాల రంగుల్ని గుర్తించలేకపోవడం) ఉంది. అందుకే, ఫేస్ బుక్ ను బ్లూకలర్ లో రూపొందించానని గతంలో ఆయనే చెప్పాడు.
* ఫేస్ బుక్ సీఈవో గా ఆయన జీతం కేవలం 1 డాలర్ మాత్రమే!
* తన ఆదాయంలో సగం చారిటీ కింద ఇచ్చేందుకు 2010లో బిల్ గేట్స్, వారెన్ బఫెట్ తో కలిసి జుకర్ సంతకం చేశారు.

More Telugu News