: దర్గాలో బాంబు పేలుడు కేసులో స్వామి అసిమానందను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు!

రాజ‌స్థాన్ రాష్ట్రం అజ్మీర్ లోని సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిష్టి దర్గాలో 2007, అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుడు కేసులో సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టిన ప్ర‌త్యేక ఎన్ఐఏ న్యాయ‌స్థానం ఇందులో నిందితుడిగా ఉన్న స్వామి అసిమానందను నిర్దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పింది. ఈ కేసులో మరో ఇద్దరికి క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మ‌రో ముగ్గురు దేవేంద్ర గుప్తా, భవేశ్‌ పటేల్, సునీల్ జోషి (మృతి చెందాడు)లను దోషులుగా తేల్చుతూ దేవేంద్ర, భవేశ్‌ లకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. అయితే, వారిరువురికీ ఈ నెల 16న శిక్ష ఖరారు చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

More Telugu News