: స్మిత్ క్షమాపణలు చెప్పినా బీసీసీఐ శాంతించలేదు!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రేగిన వివాదంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్షమాపణలు చెప్పి, వివరణ ఇచ్చినా సద్దుమణగలేదు. తొలుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా కెప్టెన్ వ్యవహార శైలిపై రిఫరీకి ఫిర్యాదు చేయగా, ఇప్పుడు రంగంలోకి బీసీసీఐ దిగింది. స్మిత్ పై చర్యలు తీసుకోవాలంటూ ఐసీసీకి సూచించింది. స్మిత్ వీడియోలు పలు మార్లు పరిశీలించామని చెప్పిన బీసీసీఐ కోహ్లీకి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

కోహ్లీ పరిపూర్ణమైన సమయోచితమైన క్రికెటర్ అని కితాబునిచ్చింది. స్మిత్ డ్రెస్సింగ్ రూంకు సైగ చేయడం పట్ల కోహ్లీ అంపైర్ ను ప్రశ్నించాడని, అప్పుడు అంపైర్ కూడా కోహ్లీకి మద్దతు పలికాడని బీసీసీఐ గుర్తుచేసింది. దీంతో ఈ వివాదం ఇంకెంత కాలం సాగుతుందో చూడాలి.  

More Telugu News