: తదుపరి టెస్టు మ్యాచులకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరం

భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ మొద‌టి టెస్టు మ్యాచులో అద‌ర‌గొట్టినప్ప‌టికీ రెండో టెస్టు మ్యాచులో త‌డ‌బ‌డి ఓడిన‌ విష‌యం తెలిసిందే. అయితే, ఆ జ‌ట్టుకు మ‌రో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మిగ‌తా టెస్టు మ్యాచుల్లో ఆడ‌లేడు. భుజం నొప్పి కార‌ణంగా ఆయ‌న జ‌ట్టుకు దూర‌మ‌య్యాడ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. కొంతకాలంగా ఆయ‌న భుజం గాయంతో బాధ‌ప‌డుతున్నప్పటికీ ఆడ‌నిస్తున్నామ‌ని, అయితే, ప్ర‌స్తుతం నొప్పి ఎక్కువ కావడంతో అతడు ఆడలేకపోతున్నాడని పేర్కొంది. చికిత్స కోసం ఆయ‌న ఆస్ట్రేలియా వెళ్ల‌నున్నాడు.

More Telugu News