: ఇకపై ఉచిత గ్యాస్ సిలిండర్లకు కూడా ఆధార్ తప్పనిసరి!

ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజనా కింద పేద మహిళలకు అందజేసే ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు ఆధార్ ను తప్పనసరిగా జతచేయాలని పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం మే 31న ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తోంది. గతంలో గ్యాస్ సబ్సిడీ సిలిండర్లకు మాత్రమే ఆధార్‌ గుర్తింపు తప్పనిసరి చేశారు. ఇప్పుడు దానిని ఉచిత సిలిండర్లకు కూడా వర్తింప చేస్తున్నట్లు తెలిపారు.

ఆధార్ కార్డులు లేని వారు మే 31వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కు దరఖాస్తు చేసుకున్నవారు తాము దరఖాస్తు చేసుకున్న కాపీతో పాటు బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఫొటోగ్రాఫ్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డ్‌, పాన్‌ నెంబర్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, ఫొటో ఉన్న సర్టిఫికెట్‌పై గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకం చేసిన కాపీలను జతచేయాలని సూచించారు. 

More Telugu News