: దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. జాతికి అంకితం చేసిన ప్రధాని

గుజరాత్‌లోని భరూచ్‌లో నర్మదా నదిపై నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. 1,344 మీటర్ల పొడవు, 22.8 మీటర్ల వెడల్పున్న ఈ వంతెన నిర్మాణానికి రూ.379 కోట్లు ఖర్చు చేశారు. నాలుగు రోడ్లతోపాటు మూడు మీటర్ల వెడల్పు ఉన్న ఫుట్‌పాత్‌ను దీనిపై నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేసింది. బ్రిడ్జిపై 400కుపైగా ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్-ముంబై 8వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా నిర్మించిన ఈ బ్రిడ్జిలో 25 నుంచి 40 మీటర్ల పొడవున్న 216 కేబుళ్లు వినియోగించారు.

More Telugu News