: ఇప్పుడర్థమైందా? మేము 'పాము' కాదని...?: ఆసీస్ ఆటగాడికి కోహ్లీ కౌంటర్

పూణే టెస్టులో విజయం సాధించిన అనంతరం గెలిచిన ఉత్సాహంతో ఆసీస్, గెలవాలన్న కసితో భారత్ బెంగళూరులో అడుగుపెట్టాయి. టాస్ గెలిచిన భారత్ ను నాధన్ లియాన్ దారుణంగా దెబ్బతీశాడు. 8 వికెట్లు తీసి భారత్ పతనాన్ని రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో శాసించాడు. దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం నాధన్ లియాన్ మాట్లాడుతూ, టీమిండియా పాములాంటిదని అన్నాడు.

కోహ్లీ అనే తలను తీసేస్తే.... టీమిండియా నిర్జీవమైపోతుందని పేర్కొన్నాడు. దీనికి రెండో టెస్టు విజయం సాధించిన అనంతరం కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. తలను తీసేసినా పాము బతికే ఎలా ఉండగలిగింది? అంటే టీమిండియా పాము కాదన్న విషయం అంతా గుర్తించాలని సూచించాడు. అంతే కాకుండా తామంతా జట్టుగా, సమష్టిగా గెలిచామని తెలిపాడు. ఓడిపోయినా సమష్టిగా ఓడిపోయామని చెప్పాడు. ఈ ప్రత్యేకమైన రోజున విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని చెబుతూ, ఆటతీరుపట్ల గర్వపడుతున్నానని కోహ్లీ ట్వీట్ చేశాడు. దీనికి అభిమానుల నుంచి ఆదరణ లభిస్తోంది. 

More Telugu News