: రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ? .. 'మా'లో లుకలుకలు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మూవీ) కొత్త అధ్యక్షుడిగా నటుడు శివాజీ రాజా ఏకగ్రీవంగా ఎంపికైన విషయం తెలిసిందే. మిగిలిన సభ్యులు ఎంపిక కూడా జరిగింది. 2019 వరకు ఈ పదవిలో శివాజీ రాజా కొనసాగనున్నారు. అయితే, నిన్నటి వరకు ‘మా’కు అధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కనిపించకపోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ‘మా’ కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజాను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ కనిపించలేదు.

దీంతో, ఆ పదవికి శివాజీ రాజాను ఎన్నుకోవడం రాజేంద్ర ప్రసాద్ కు ఇష్టం లేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, గత రెండేళ్లుగా ‘మా’ అభ్యున్నతికి రాజేంద్ర ప్రసాద్ బాగానే కృషి చేశారని, ‘మా’ అధ్యక్ష బాధ్యతలు రెండోసారి కూడా ఆయనకే దక్కుతాయని అందరూ అనుకున్నారట. కానీ, ‘మా’ కోసం శివాజీరాజా కష్టపడటాన్ని చూసిన సినీ పెద్దలు, ఆ పదవిని ఆయనకే కట్టబెట్టాలని అనుకోవడంతో ‘నట కిరిటీ’ రాజేంద్రప్రసాద్ తప్పుకోవాల్సి వచ్చింది. మాజీ అధ్యక్షుడి హోదాలో నైనా ప్రెస్ మీట్స్ కు రాజేంద్ర ప్రసాద్ హాజరు కాకపోవడం, ‘మా’ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికపై తన స్పందన తెలియజేయకపోవడంతో విమర్శలు తలెత్తుతున్నాయి.

More Telugu News