: మన జాతీయ పతాకాన్ని చూసి కంగారు పడుతున్న పాకిస్థాన్!

అమృత్ సర్ సమీపంలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న అటారీ సమీపంలో ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన (360 అడుగులు) భారత జాతీయ పతాకం పాకిస్థాన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ జెండా పాక్ లోని లాహోర్ నుంచి కూడా కనిపిస్తోందట. ఇదే, పాకిస్థాన్ లో పలు అనుమానాలను పెంచుతోంది. ఈ జెండా ద్వారా ఇండియా ఏదైనా నిఘా నిర్వహిస్తోందేమోననేది పాక్ అనుమానం. జెండా కోసం ఏర్పాటు చేసిన స్తంభంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారేమోనని పాక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాక్ రేంజర్లు కూడా ఇదే భావనలో ఉన్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ మీడియా కూడా చెబుతోంది. అయితే, పాక్ అనుమానాలను బీఎస్ఎఫ్ అధికారులు కొట్టి పారేశారు. పాక్ అనుమానిస్తున్నట్టు జెండా స్తంభంలో ఎలాంటి నిఘా కెమెరాలు లేవని చెప్పారు. 

More Telugu News