: బంతులు వేయడంలో.. అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్!

టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రికార్డును స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్రేక్ చేశాడు. గతంలో ఒక సీజన్ లో అత్యధిక బంతులు సంధించిన బౌలర్ గా దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2004-05 సీజన్ లో కుంబ్లే 3,673 బంతులు ప్రత్యర్ధులకు సంధించడం ద్వారా ఒక సీజన్ లో అత్యధిక బంతులు సంధించిన బౌలర్  గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును అశ్విన్ తిరగరాశాడు. ఈ సీజన్ లో అశ్విన్ మొత్తం 3,749 బంతులు సంధించాడు. తద్వారా కుంబ్లే రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఒక సీజన్ లో అత్యధిక బంతులు సంధించిన రికార్డులో టాప్ ఐదుగురు బౌలర్లు భారతీయులే కావడం విశేషం. వారిలో నెంబర్ వన్ రవిచంద్రన్ అశ్విన్, తరువాతి స్థానంలో కుంబ్లే ఉండగా, ఆ తరువాతి స్థానంలో వరుసగా వినూ మన్కడ్ (1952-53 సీజన్ లో 3,662 బంతులు), దిలీప్ జోషి (1979-80 సీజన్ లో 3,515 బంతులు), రవీంద్ర జడేజా (2016-17 సీజన్ లో 3469 బంతులు) తదితరులున్నారు. 

More Telugu News