: బరాక్‌ ఒబామా సర్కారు డొనాల్డ్‌ ట్రంప్‌ టెలిఫోన్‌ను ట్యాప్‌ చేయలేదు: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌

గత ఏడాది చివ‌ర్లో జ‌రిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బరాక్‌ ఒబామా ఆదేశాల మేరకు డొనాల్డ్‌ ట్రంప్‌ టెలిఫోన్‌ను ట్యాప్‌ చేసినట్లు ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఈ వార్త‌ల‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమి ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌ను తిరస్కరించాలని ఆయన ఆ దేశ‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ను కోరిన‌ట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఈ వార్తలు ఎఫ్‌బీఐ చట్టాన్ని అతిక్రమించిందనే తప్పుడు సంకేతాలను ఇస్తాయ‌ని ఆయ‌న అన్నారు. అయితే, ఆయ‌న చేసిన విన‌తిపై అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

కానీ, ఒబామా ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందేమోనన్న విషయాన్ని గురించి ఆరా తీయాల‌ని అమెరికా కాంగ్రెస్‌ను కోరింది. ఈ అంశంపై వైట్‌హౌస్ ప్రతినిధి సియాన్‌ స్పైసర్ స్పందిస్తూ.. ఆ ఎన్నికల్లో రాజకీయ ప్రభావిత దర్యాప్తులపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు.

More Telugu News