: నాకు ఆ ముగ్గురు హీరోలు నచ్చుతారు: కోట శ్రీనివాసరావు

ఇప్పుడున్న సినిమా నటులలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తనకు నచ్చుతారని విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘సుమారు ఏడు వందలకు పైగా చిత్రాల్లో నేను నటించాను. గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ, నాలో నటన అన్నది జీర్ణించుకుపోయింది. నాకు తెలుగుదనం, ఆంధ్రులు.. ఈ వాతావరణం.. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ‘వన్ మ్యాన్ ఆర్మీ’లా నేను అందరితో పోట్లాడుతుంటాను అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, నా అభిప్రాయం మాత్రమే చెబుతుంటాను.

అసలు తెలుగు నటులు ఏం పాపం చేశారు? పరభాషా నటులు అంటే కోట శ్రీనివాసరావుకు పడదని అంటూ ఉంటారు? ఆ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే, నజీరుద్దీన్ షా, నానా పటేకర్, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురండి.. మహానుభావులు.. అలాంటి వారిని తెలుగు సినిమాల్లో పెడితే ఎవరూ మాట్లాడరు.. పరభాషా నటులు ఇక్కడ నటించకూడదు అని నేను చెప్పను.  కానీ, ఆయా భాషల్లో ఉన్న మంచి నటులను మన చిత్రాల్లో నటింపజేయాలే తప్పా, నటులు కానీ వారిని తీసుకురావద్దు.... తెలుగు నటులను పెట్టుకోమని దర్శకులను, హీరోలను అడిగితే.. ఆ విషయాన్ని దర్శకుడు చూసుకుంటారని హీరో ... హీరో చూసుకుంటాడని దర్శకుడు చెబుతుంటారు. వీళ్లిద్దరూ ఉన్నప్పుడు అడిగితే.. ‘మాదేం లేదు.. అంతా నిర్మాతదే’ అని సమాధానం చెబుతుంటారు’ అని కోట చెప్పుకొచ్చారు.

More Telugu News