: 29న కాదు, 28నే ఉగాది!: శ్రీనివాస గార్గేయ

ఈ సంవత్సరంలో తెలుగు సంవత్సరాది పర్వదినాన్ని జరుపుకునే తేదీలో ఏర్పడ్డ అనుమానాలను కంచిపీఠ ఆస్థాన పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ తీర్చేందుకు ప్రయత్నించారు. ప్రాచీన గణితమా?, దృగ్గణితమా? అన్న సంశయం నెలకొని వుండటంతోనే ఉగాదిపై సందిగ్ధత నెలకొందని, ఈ సంవత్సరం మార్చి 28నే ఉగాది జరుపుకోవాలని యాదగిరిగుట్టలో ఆయన అన్నారు.

2007లో సర్వజిత్ నామ సంవత్సరం ఆరంభించిన విషయంలో సందేహం వస్తే, నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీ, దృగ్గణిత ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. దీని ప్రకారం, 28నే ఉగాది పర్వదినమని, ఈ మేరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవును సవరించుకోవాలని కోరారు. ప్రధాన దేవాలయాలు అసత్యమైన పూర్వగణిత విధానంతో పంచాంగాలను తయారు చేయడం వల్లే ఇలాంటి అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News