: అప్పటి ఆ అనాథాశ్రమంలో 800 మంది చిన్నారులను చంపేశారట!

పెళ్లికాని తల్లులకు, వారి పిల్లలకు ఆశ్రయమిచ్చే అనాథాశ్రమాల్లో ఒక‌టైన ఓ ఆశ్ర‌మంలో చిన్నారుల అవ‌శేషాలు ఉన్నాయ‌ని ఐర్లాండ్ అధికారులు తెలిపారు. 1961లో మూసేసిన గాల్వే కౌంటీ, టువామ్‌లోని 'బోన్ సెకూర్స్ మదర్ అండ్ బేబీ హోమ్'లో జ‌రుపుతున్న తవ్వ‌కాల్లో ఈ అవ‌శేషాల‌ను గుర్తించిన‌ట్లు చెప్పారు. ఇక్క‌డ సామూహిక హత్యలు జరిగినట్లు తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు 800 మంది బాలలు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు నిర్ధారించిన‌ట్లు చెప్పారు. ఓ చరిత్రకారుడు ఈ బాలల ఆచూకీ కోసం చేసిన కృషి ఈ దర్యాప్తునకు దారి తీసిందని పేర్కొన్నారు.

ఈ త‌వ్వ‌కాల‌ను గ‌త ఏడాది నవంబరు నుంచి జరుపుతున్నారు. ఈ ప‌రిశోధ‌న‌ల ఫ‌లితంగా భూగర్భంలో ఓ నిర్మాణం కనిపించిందని పేర్కొన్నారు. అందులో ఉన్న 20 ఛాంబర్లలోనే ఈ బాల‌ల అవ‌శేషాలు దొరికిన‌ట్లు తెలిపారు. ఆ బాల‌ల వయసు 35 వారాల నుంచి మూడేళ్ళ వరకు ఉంటుందని తెలిపారు. ఈ సామూహిక హ‌త్య‌లు 1950వ దశకంలో జరిగినట్లు తాము భావిస్తున్న‌ట్లు చెప్పారు.

More Telugu News